TDP on Fake Votes: టీడీపీ మద్దతుదారుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగించారు: బొండా ఉమ - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
TDP Leader Bonda Uma Maheswara Rao On Fake Votes : ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో దొంగ ఓట్లు చేర్చుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఒకే డోర్ నెంబర్‌పై వందల కొద్దీ ఓట్లు నమోదయ్యాయని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలోని సీతారాపురం కడియాలవారి వీధిలో ఒకే డోర్ నెంబర్‌పై 506 ఓట్లు ఉన్నాయని ఆయన ఆధారాలతో సహా చూపారు. బూత్ నెంబర్ 35లో డోర్ నెంబర్ లేకుండానే 500 ఓట్లు చేర్చారని అన్నారు. ఈ ఏడాది జనవరిలో ఓటర్ల జాబితా ప్రకటించారని, ఆ తరువాత మార్చి నెలాఖరు నాటికి 7,879 మంది ఓటర్ల పేర్లను తొలగించి, 2360 మంది పేర్లను చేర్చారన్నారు. దీనిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పులపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని ఉమ ఆరోపించారు. రాష్ట్రంలోని ఉరవకొండ, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లోనూ ఇలాగే వేలాది పేర్లను జాబితాల్లోంచి అక్రమంగా తొలగించారని ఆయన అన్నారు.