TDP Leader Bandaru Satyanarayana Murthy ఎన్ని కేసులు పెట్టినా నా పోరాటం ఆగదు..: బండారు సత్యనారాయణమూర్తి - స్వగ్రామానికి చేరుకున్న మాజీ మంత్రి బండారు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 11:36 AM IST
TDP Leader Bandaru Satyanarayana Murthy Interview: మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో అరెస్టై స్టేషన్ బెయిల్‌పై తిరిగొచ్చిన తెలుగుదేశం నేత బండారు సత్యనారాయణమూర్తికి.. స్వగ్రామం వెన్నెలపాలెంలో ఘనస్వాగతం లభించింది. గుంటూరు నుంచి వచ్చిన బండారు సత్యనారాయణ మూర్తికు.. కుటుంబసభ్యులు, తెలుగుదేశం మహిళా నాయకులు హారతి పట్టి స్వాగతం పలికారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మంత్రి రోజా దూషించడం వల్లే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని సత్యనారాయణమూర్తి చెప్పారు. తనకు తన కుటుంబానికి అండగా నిలిచిన వెన్నెలపాలెం గ్రామస్థులకు, టీడీపీ మహిళలకి కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం కదిలివచ్చిన మహిళలు, కార్యకర్తలకి రుణపడి ఉంటానని అన్నారు. తనకు, పార్టీకి కార్యకర్తలే ధైర్యం ఇచ్చారని కొనియాడారు. తనను జైలులో పెట్టినా సరే.. పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవినీతిపై, విధ్వంసంపై పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు. విమర్శలు చేసినా పర్లేదని.. కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి, మహిళల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదని చెప్పారు. తనను పోలీసులు అరెస్టు చేసిన తీరు, తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ అండగా నిలవడంపై.. సత్యనారాయణమూర్తి దంపతులతో ముఖాముఖి.
TAGGED:
బండారు సత్యనారాయణమూర్తి