ayyanna patrudu speech: 'మరోసారి జగన్ గెలిస్తే.. మన కిడ్నీలను సైతం అమ్మేస్తాడు' - ayyanna patrudu speech in Mahanadu 2023
🎬 Watch Now: Feature Video
ayyanna patrudu speech in Mahanadu 2023: నాలుగేళ్లుగా ప్రతిపక్షాలను జగన్ ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. ప్రపంచంలో తెలుగువారి గౌరవాన్ని పెంచింది ఎన్టీఆర్ అని కొనియాడారు. నటనలో ఎన్టీఆర్‌కు సాటి మరెవరూ లేరని.. ఏ పాత్రలో నటించినా అందులో లీనమయ్యే వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమేలుతోందని.. పింఛను 3 వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశారని అయ్యన్న దుయ్యబట్టారు. జగన్మోహన్రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు.
25 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కట్టలేదని.. జగన్ పాలనలో ఏ మంత్రికీ విషయ పరిజ్ఞానం లేదని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. మన పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ టీడీపీ రావాలని.. ప్రతి ఒక్కరూ చంద్రబాబును గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో ఇప్పటికే రాష్ట్రం సర్వ నాశనమైందని, మరోసారి జగన్ వస్తే.. ప్రజల కిడ్నీలను సైతం అమ్మేస్తారని విమర్శించారు.