ఎల్లలు దాటినా చెక్కుచెదరని అభిమానం - చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని సింగపూర్‌లో పాదయాత్ర, పూజలు - లిటిల్ ఇండియాలో తిరుమల్ శ్రీనివాసం దేవాలయం టీడీపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 1:44 PM IST
TDP Forum Members Padayatra in Singapur : చంద్రబాబుకు మద్దతుగా సింగపూర్‌లో తెలుగుదేశం ఫోరం సభ్యులు పాదయాత్ర చేపట్టారు. ఆయన అవినీతి కేసు నుంచి పూర్తిగా బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర సీన్గాకాంగ్ వెల్మురుగన్ దేవాలయం నుంచి లిటిల్ ఇండియాలోని తిరుమల్ శ్రీనివాసం దేవాలయం వరకు 13కిలోమీటర్ల మేర నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. తరవాత 3వందల మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఫోరం సభ్యులంతా పాల్గొని చంద్రబాబుకు అంతా మంచి జరగాలని వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నారు.
Special Pooja for Chandrababu Naidu Health in Singapur : చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వ అక్రమ కేసు తరువాత బాబు అభిమానులు వివిధ రకాలుగా పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసింది. ఇదే తరహాలో అనారోగ్య సమస్యలతో బెయిల్ మీద బయటకొచ్చిన బాబు ఆరోగ్యం గురించి కూడా పలువురు కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశ, విదేశాల్లోని ప్రజలు టీడీపీ అధినేత పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.