CBN Birthday Celebrations at Ireland: ఐర్లాండ్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు.. ఆనందంలో తెలుగు తమ్ముళ్లు - dublin
🎬 Watch Now: Feature Video
CBN Birthday Celebrations at Ireland: నవయువ మేథో శ్రామికులు.. స్వాప్నికులు.. భావితరాల భవిష్యత్తుకు భరోసా అయిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 73వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు నిన్న ఘనంగా నిర్వహించారు. అయితే చంద్రబాబుకు రాష్ట్రంలోనే కాకుండా ఖండంతారాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనం. తాజాగా ఆయన పుట్టినరోజు వేడుకలను ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకతను వ్యక్తం చేస్తూ.. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రం అధిరోహించిన ప్రగతి శిఖరాలను చూసి.. నేడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేస్తూ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. సైకో పాలనకు స్వస్తి పలికి సైకిల్ పాలనకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో టీడీపీ ఐర్లాండ్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సీత కేకే కట్ చేసి సభ్యులకు పంచారు. ప్రెసిడెంట్ భాష్యం భరత్, రీజియనల్ కో ఆర్డినేటర్ డా.కిషోర్ బాబు చలసాని, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రంగ గల్లా, యశ్వంత్ మడకశిర, కాట్రగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, నరేంద్ర, శివబాబు, రామకృష్ణ , విజయ్ తదితరులు పాల్గొన్నారు.