TDP Bus Yatra: బస్సుయాత్రలకు సిద్దమవుతున్న టీడీపీ నేతలు.. ఈ నెల 23న అనంతలో .. - tdp bus yatra schedule news
🎬 Watch Now: Feature Video
TDP Bus Yatra: ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఈ నెల 23 నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథిలతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కవర్‌కాని నియోజకవర్గాలకు ప్రాధాన్యతనిస్తూ.. ఈ నెల 23 నుంచి పది రోజులపాటు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మది వరకు బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు. దీనిలో భాగంగా సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. బస్సుయాత్ర నిర్వహిస్తున్న రోజుల్లో తమ అధినేత చంద్రబాబు నాయుడు ఒకరోజు తమతో పాటు బస్సుయాత్రలో పాల్గొంటారని, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. ఈ బస్సుయాత్రలో అన్ని నియోజకవర్గాల బాధ్యులు పది రోజులపాటు పాల్గొంటారని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.