రైతులను నిరాశపర్చిన సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన - జగన్ వైఎస్ఆర్జిల్లా పర్యటనపై భూమిరెడ్డి వ్యాఖ్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 1:31 PM IST
TDP Bhumireddy RamGopalreddy On CM Kadapa Tour : సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన రైతులను నిరాశపర్చిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు. కరవు కరాళ నృత్యం చేస్తున్నా రైతులను సీఎం పరామర్శించలేదని మండిపడ్డారు. పంటల బీమా ఎలా ఇస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని పులివెందుల ప్రజలు రోడ్డెక్కారని వివరించారు.
CM Jagan YSR Kadapa Tour 2023 : పులివెందులో తీవ్రమైన కరవు నెలకొన్న విషయం తెలిసి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తామన్నారు.. కానీ సమస్యలపై చర్చించకుండా అలా అనడంలో మీ ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని ఎమ్మెల్సీ అన్నారు. రైతులు సాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భూ గర్భజలాలు ఎండిపోయి ప్రజలకు తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. రైతులకు బీమా సదుపాయం ఇన్పుట్ సబ్సీడీ ఇస్తారా? రైతు బీమా ఇస్తారా? ఏ విధంగా ఇస్తారు, ఏ పంటకు ఎంత ఇస్తారో స్పష్టం చేయండి అని కోరారు.