TDP and YCP Leaders Attacked Each Other: సచివాలయ భవనం విషయంలో గొడవ.. వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడులు - ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 5:05 PM IST
TDP and YCP Leaders Attacked Each Other: శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లిలో ఒక సచివాలయ భవనానికి సంబంధించిన వివాదం టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. టీడీపీ(TDP) హయాంలో ఒక భవనాన్ని గ్రామంలో నిర్మించారు. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించిన స్థలానికి, నిర్మాణానికి డబ్బు చెల్లింపు జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక భవనాన్ని సచివాలయానికి కేటాయించారు. కానీ స్థల యజమాని, కాంట్రాక్టర్ డబ్బు ఇస్తేనే భవనం ఇవ్వనని చెప్పారు. దీంతో స్థానికంగా ఉన్న వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ వైసీపీ వారిని ధర్మవరం తరలించారు.
వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ నేతను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితున్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ(Former MLA Suryanarayana) పరామర్శించారు. డబ్బు చెల్లించకపోతే.. భవనం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వేలాది బిల్డింగ్లు ఇలాంటి వివాదంలోనే ఉన్నాయన్నారు. వారందరి వద్దకు వెళ్లి ఇలానే దాడులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే చేస్తే ధర్మవరం ఎమ్మెల్యేను బట్టలు విప్పి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దీనిపై హైకోర్టుకు కూడా వెళ్తామన్నారు.