Tamarapalli Farmers Agitation: స్పిన్నింగ్ మిల్లుకు భూములిచ్చాం.. అమ్మితే సహించం: తామరపల్లి రైతులు - Agitation On Spinning Mill Lands in Srikakulam
🎬 Watch Now: Feature Video
Farmers Agitation For Lands: తమ భూములు తమకే కావాలని శ్రీకాకుళం జిల్లాలోని తామరపల్లి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 40సంవత్సరాల క్రితం స్పిన్నింగ్ మిల్లు నిర్మిస్తామంటే భూములు ఇచ్చామని.. ఇప్పుడు వాటిని అమ్మటానికి చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామంలోని.. శ్రీ శాలివాహన స్పిన్నింగ్ మిల్లు సహకార బోర్డు కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. స్పిన్నింగ్ మిల్లు నిర్మిస్తామని సహకార బోర్డు భూములను సేకరించిందని.. అప్పుడు వివిధ గ్రామాల రైతులు మిల్లు నిర్మాణానికి 30 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని అన్నారు. ఆ భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టకపోవటంతో ఆ భూములు ప్రస్తుతం బీడుగా మారినట్లు వివరించారు. దీంతో వాటిని అమ్మేందుకు స్పిన్నింగ్ మిల్లు సహకార బోర్డు ఆదివారం సమావేశం నిర్వహించింది. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున స్పిన్నింగ్ మిల్లు సహకార బోర్డు కార్యాలయం వద్దకు చేరుకుని సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో రైతులకు బోర్డు యాజమాన్యానికి తీవ్ర వివాదం చెలరేగింది. తమ భూములను అమ్మితే సహించేది లేదని రైతులు తేల్చిచెప్పారు.