Suspended YCP MLA Mekapati Chandrasekhar Reddy Comments: త్వరలో టీడీపీలో చేరుతా.. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి - YCP MLA Mekapati Chandrasekhar Reddy
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2023, 5:45 PM IST
Suspended YCP MLA Mekapati Chandrasekhar Reddy Comments: వినాయకుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. కడపలో సిద్ధి వినాయక ఆలయాన్ని ఆయన సందర్శించారు. చంద్రబాబుకు, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా నా గ్రాఫ్ బాగాలేదని సీఎం జగన్ చెప్పారని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నేను తప్ప ఉదయగిరిలో ఎవరూ గెలవరని వెల్లడించారు. చంద్రబాబు టికెట్ ఇస్తే మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకపోయినా టీడీపీలోనే కొనసాగుతానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం లేవని ప్రజలకు అర్థమైందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కోరిక, నిరుద్యోగుల కోరిక కూడా తీరుతుందని.. అందరూ సంతోషంగా ఉంటారన్నారు. చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఇప్పటికే పార్టీలో చేరేవాడినని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు.