సమ్మర్ స్పెషల్.. విజయవాడలో బాహుబలి సెట్టింగ్స్‌తో ఎగ్జిబిషన్ - కృష్ణా జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Bahubali Movie Setting Exibition: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బాహుబలి చిత్రంలోని భారీ సెట్టింగ్‌లు నగరవాసులను అలరించనున్నాయి. ఆదివారం శాతవాహన కళాశాల ప్రాంగణంలో బహుబలి చిత్రంలోని భారీ సెట్టింగ్స్‌తో కూడిన ఓ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు త్వరలో సమ్మర్ హాలీడేస్ రానున్న నేపథ్యంలో ఈ బాహుబలి ఎగ్జిబిషన్ నగర వాసుల ముందుకు తీసుకుని వచ్చినట్లు నిర్వాహకులు చెపుతున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బాహుబలి సినిమాలోని వివిధ రకాల సన్నివేశాలతో కూడిన సెట్టింగ్‌లను నిర్వాహకులు ప్రదర్శనకు ఉంచారు. ఈ సెట్టింగ్స్‌తో కూడిన ఎగ్జిబిషన్ చూసేందుకు వచ్చే నగరవాసులు తమ మొబైల్ ఫోన్స్‌లో ఫొటోలు తీసుకునేందుకు అనుమతి ఉంది. విజయవాడ నగరంలో మొట్ట మొదటిసారిగా సినీ సెట్టింగ్స్‌తో కూడిన ఎగ్జిబిషన్ ఇదేనని నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవుల్లో నగరవాసులకు ఆటవిడుపుగా ఎగ్జిబిషన్ అలరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు.