'నేను చనిపోతున్నా' నా ఉసురు మీకు తగులుతుంది - కలకలం రేపిన సెల్ఫీ వీడియో - Anantapur District News
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 12:42 PM IST
Suicide Attempt With Selfie in Anantapur District : ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని సామాజిక మాధ్యమంలో పెట్టిన ఘటన అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామంలో జరిగిన సెల్ఫీ వీడియో ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భూవివాదాల విషయంపై తనను ముగ్గురు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని దివాకర్ అనే వ్యక్తి ఆవేదన చెందాడు. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని తన స్నేహితులకు పంపించాడు.
Viral Selfie Suicide Attempt Video : అనంతరం తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామ శివార్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు దివాకర్ రెడ్డి ఆచూకి తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకునే ఆలోచన విరమింపజేశారు. భూ సమస్యను కుటుంబ సభ్యులు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని తెలిపారు. మంగళవారం కుటుంబసభ్యులు అందరూ స్టేషన్ వద్దకు రావాలని పోలీసులు సూచించారు.