Stolen Mobile Phones Worth One Crore Thirty lakhs: రూ.1 కోటి 30 లక్షల విలువచేసే ఫోన్లు చోరీ... ఎక్కడంటే..! - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2023, 5:16 PM IST
Stolen Mobile Phones Worth One Crore Thirty lakhs: నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై గల ఓబులాపురం వద్ద రూ.1 కోటి 30 లక్షల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానా నుంచి బెంగళూరుకి బయలుదేరిన కంటైనర్‌లో రూ.1 కోటి 30 రూపాయల విలువచేసే సెల్ ఫోన్లు వెళుతున్నాయి. ఈ వాహనంలో ఇద్దరు డ్రైవర్లు ఉండగా.. కంటైనర్ ఈనెల 11న ఓబులాపురం మిట్ట వద్దకు రాగానే అక్కడ కంటైనర్‌ను ఆపారు. అనంతరం ఇద్దరు డ్రైవర్లు కంటైనర్ తాళం పగలకొట్టారు. అందులో ఉన్న సెల్ ఫోన్లను మరొక వాహనంలోకి ఈ తరలించారు. కంటైనర్ తాళం పగల గొట్టగానే వాహన యజమనికి సందేశం వెళ్లింది. అప్రమత్తమైన యజమాని డ్రైవర్లకు ఫోన్ చేయగా... వారి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో యజమాని నంద్యాలకు బయలుదేరి వచ్చాడు. జాతీయ రహదారిలో కంటైనర్ చాలా సేపు ఆగి ఉండడం గమనించిన హైవే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ కంటైనర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ యజమాని ఫల్వాందర్ సింగ్ డోన్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా... ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఫోన్ల చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్యానాకు వెళ్లి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.