Srikalahasti temple kept open during eclipse చంద్రగ్రహణం వేళ.. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు! - చంద్రగ్రహణం అంటే ఏమిటి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 10:30 PM IST
Srikalahasti temple kept open during eclipse: తాత్కాలిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడితే... ఒక్క శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం భక్తులతో కళకళలాడుతోంది. గ్రహణం రోజున శ్రీకాళహస్తీశ్వరునికి ఆలయ అర్చకులు గ్రహణ కాల అభిషేకం నిర్వహిస్తారు. రాహు, కేతు, సర్ప దోష నివారణ క్షేత్రంగా ఈ ఆలయం పేరుగాంచింది. గ్రహణ గండాలకు ఈ ఆలయం అతీతం. చంద్రగ్రహణ సమయంలో స్పర్శ కాల, మధ్యకాల, మోక్ష కాల అభిషేకాలను స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తారు. గ్రహణం అనంతరం ఆలయంలో సంప్రోక్షణ పూజలు చేపట్టి స్వామి ,అమ్మవార్లకు శాంతి అభిషేకాలు చేస్తారు. గ్రహణకాల సమయంలో స్వామి అమ్మవార్లను భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వరలో పూజలు నిర్వహించడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7 గంటల 15 నిమిషాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసేశారు.