ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం - ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి
🎬 Watch Now: Feature Video
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు దివ్య కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం మహా మండపం ధర్మపథము కళావేదిక వద్ద ప్రముఖ కవి పండితులచే స్వామి వారి, అమ్మ వార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా కవి పండితులను ఆలయ పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ భ్రమరాంబ సత్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు నడుమ అత్యంత వైభవంగా స్వామి, అమ్మ వార్ల కల్యాణం జరిపించారు. కళ్యాణోత్సవ వేళ ఆదిదంపతులకు ఆలయ పాలక మండలి, అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. స్థానాచార్యులు శివ ప్రసాద శర్మ, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, మల్లేశ్వర శాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, రంఘావఝుల శ్రీనివాస శాస్త్రి తదితరులు రెండు బృందాలుగా కొందరు వరుడి పక్షం, మరి కొందరు వధుపక్షం వహించి ఉత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు.
TAGGED:
Indrakeladri Kalyanotsavam