క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలపై సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష- సంఘీభావం తెలిపిన టీడీపీ, జనసేన నేతలు - అక్రమ మైనింగ్ వేస్ట్ దీక్షలో సోమిరెడ్డి ఫైర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 2:44 PM IST

Somireddy Fires In Illegal Mining Waste Initiation: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వర్ధయిపాలెంలో క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్ష మూడో రోజు కొనసాగిస్తున్నారు. మైనింగ్‌ ప్రాంతంలోనే దీక్ష చేస్తున్న సోమిరెడ్డికి టీడీపీ, జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. స్థానిక గ్రామాల ప్రజలు కూడా సోమిరెడ్డికి మద్దతుగా నిలిచారు. అక్రమ మైనింగ్‌పై ఎందుకు స్పందించడం లేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అధికారులను నిలదీశారు. అక్రమ మైనింగ్‌పై కోర్టు ఆదేేశించినా పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు.  

Authorities Not Respond In Stake Illegal Mining: ఇక్కడున్న పేలుడు పదార్దాల వంటివి నక్సలైట్ల చేతుల్లో పడితే పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. జనసేన సమావేశాలకు వేసిన ఫ్లెక్సీలను తొలగించిన అధికారులకు ఇక్కడ ఇంత అక్రమంగా తవ్వకాలు జరుగుతుంటే కనిపించడం లేదా అని జనసేన నాయకుడు అజయ్‌ మండిపడ్డారు. అధికారులు వచ్చే వరకు వాహనాలను బయటకు వదిలేది లేదని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. సర్వేపల్లి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తలు సత్యాగ్రహానికి మద్దతు తెలిపేందుకు తరలి వస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.