ఇంట్లోకి నాగుపాము - తొలుత భయం ఆ తర్వాత పట్టుకుని పూజలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 17, 2023, 9:45 PM IST
Snake at Home in Konaseema District: నాగులచవితి పండుగ సందర్భంగా ఉదయాన్నే భక్తులంతా పుట్టలో పాలు పోసి నాగేంద్రుడికి మ్రెక్కులు చెల్లించారు. నాగుల చవితి పురస్కరించుకొని మహిళలు అంతా కలిసి కాలువగట్లు, కొబ్బరి తోటల్లో ఉన్న పాముల పుట్టల వద్దకు చేరుకుని పుట్టలో పాలు కోడిగుడ్లు, వడపప్పు, చలిమిడి వేసి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఆ ప్రాంతంలో అలజడికి పుట్టలో ఉన్న పాము బయటకు వచ్చి ఏకంగా ఓ ఇంటి ముందు కనిపించడంతో ఇంటిలోని వారు భయబ్రాంతులకు గురైయ్యారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడవరం మండలం చింతవారిరేవు గ్రామంలోని ఓ ఇంట్లోకి వచ్చిన నాగుపాముకు నేరుగా పూజలు నిర్వహించారు. స్థానికులు స్నేక్ కేచర్ గణేష్ వర్మకు సమాచారం ఇవ్వడంతో అతను చాకచక్యంగా వ్యవహరించి పామును బంధించాడు. అప్పటివరకు భయంగా భయంగా ఉన్న ఇంట్లోని వారు నాగరాజుకు పాలు పోసి నేరుగా పూజలు చేశారు. అనంతరం గణేష్ వర్మ పామును డబ్బాలో బంధించి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి సురక్షితంగా వదిలిపెట్టారు