Sexual Harassment: విశాఖలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. ఆపై బ్లాక్మెయిల్! - విశాఖలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు
🎬 Watch Now: Feature Video
Sexual Harassment on Miner Girl: విశాఖలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను మోసం చేసి, సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి.. అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖలోని 104 ఏరియాలోని ఓ స్కూల్లో పనిచేస్తున్న ప్యూన్ సత్యారావు.. తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని నేవీ ఉద్యోగి కుమార్తెను లైంగికంగా వేధించాడు. అంతటితో అగకుండా బాలిక ఫోటోలను మొబైల్లో చిత్రీకరించి.. వాటిని తన మిత్రులకు పంపాడు. వారు కూడా బాలికను బెదిరించి.. గత నెల 3 నుంచి 23వ తేదీ వరకు పలుమార్లు శారీరకంగా వేధించారు.
సత్యారావు పనిచేస్తున్న స్కూల్లోనే.. బాలిక పదో తరగతి చదువుతుంది. అదే విధంగా తాను ఉండే అపార్ట్మెంట్లోనే బాధిత బాలిక ఉంటుంది. దీంతో ఈ దారుణం చెయ్యడానికి నిందితుడికి అవకాశం చిక్కిందని పోలీసుల విచారణలో తేలింది. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు.. బాలికను ప్రశ్నించగా విషయం మొత్తం బయటకు వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు సత్యారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిశ పోలీస్ స్టేషన్‌కు కేసును అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. బాలికకు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేశారు.