ప్రభుత్వంపై సర్పంచుల మండిపాటు - డోర్ టు డోర్ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తామని హెచ్చరిక - Nellore District News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2023/640-480-20167416-thumbnail-16x9-sarpanch-criticized-to-ycp-government.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 6:55 PM IST
Sarpanches Criticized to YCP Government : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగలవెల్లటూరు గ్రామంలోని రోడ్ల దుస్థితిపై ఆ గ్రామ సర్పంచ్ ఆవేదనతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తుందని వాపోయారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ఒక్క రూపాయి కూడా పంచాయతీ ఖాతాలో వేయకుండా దారి మళ్లించడం దారుణమని విమర్శించారు. గ్రామస్తులందరూ ఓటు వేసి తమను గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నుకున్నా వారి కోసం ఏమి చేయలేక పోతున్నామని వాపోయారు.
గ్రామాభివృద్ధి కోసం వీధిలైట్లు, రహదారులు, నీటి సౌకర్యాలపై ఖర్చు చేయడానికి పంచాయతీ నిధులలో ఒక్క రూపాయి కూడా లేదని తెలిపారు. వాలంటీర్లకు ఇచ్చిన గౌరవం కూడా సర్పంచులకు ఇవ్వడంలేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సర్పంచులకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయటం కోసం మండలంలోని 26 పంచాయితీల సర్పంచులు ఏకం అవుతాం అన్నారు. సర్పంచులు అందరూ ఏకమై డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రతి గ్రామంలో తెలియజేస్తామని హెచ్చరించారు.