Sarpanch Candidates Kidnapped: నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థుల కిడ్నాప్.. పెనమల్లం సర్పంచ్ ఉప ఎన్నికలో ట్విస్ట్.. - తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు
🎬 Watch Now: Feature Video
Sarpanch Candidates Kidnapped In Penamallam Tirupati District: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పెనమల్లంలో సర్పంచ్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వెసేందుకు వెళ్లిన అభ్యర్థులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సర్పంచ్ ఉప ఎన్నికలో పోటీలో నిలిచేందుకు వెంకటరత్నమ్మ, జ్ఞానమ్మలను టీడీపీ ఎంపిక చేసి బలపరిచింది. ఈ క్రమంలో వారు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో.. వారిపై గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా వెంకటరత్నమ్మ, జ్ఞానమ్మలను అపహరించుకుని వాహనంలో తీసుకుని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఏర్పేడు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అభ్యర్థుల ఆచూకీ కనుక్కోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.