అమూల్ డెయిరీకి వైసీపీ ప్రభుత్వం ఎదురు పెట్టుబడులు పెడుతోంది: ధూళిపాళ్ల - Dhulipalla comments on YSRCP Gov

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 5:30 PM IST

Sangam Dairy Board Meeting: రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని విస్మరించి అమూల్ డెయిరీకి ఎదురు పెట్టుబడులు పెడుతోందని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. ుంటూరు జిల్లా సంగం డెయిరీలో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ధూళిపాళ్ల వైసీపీ అధికారంలోకి వస్తే లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన జగన్  అధికారంలోకి వచ్చాక ఎటువంటి బోనస్ పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Sangam Dairy Crossed 9lakh Liters of Milk Collection: రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి 6 వేల కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నామని, తొలిసారిగా సంగం డెయిరీ 9 లక్షల లీటర్ల పాల సేకరణ మైలురాయిని దాటిందని ధూళిపాళ్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో మూడు లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్రాసెసింగ్ యూనిట్​ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలో సంఘం డెయిరీ ఉత్పత్తులను విదేశాలకు పంపేందుకు అవసరమైన అనుమతులు తీసుకుంటునట్టు ధూళిపాళ్ల వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.