సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించేది లేదు: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు - Employees Strike in ap
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 9:56 PM IST
Samagra Shiksha Abhiyan Employees Strike in 13th Day: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 13వ రోజు ఉద్ధృతంగా కొనసాగింది. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదు వినిపించడం లేదంటూ ఉద్యోగులు నూత్న రీతిలో నిరసన తెలిపారు. పుట్టపర్తిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ర్యాలీగా పోస్టాఫీసుకు చేరుకుని తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సీఎం జగన్‌కు ఉత్తరాలు రాసి పంపారు. హెచ్ఎర్ పాలసీ, కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సమగ్ర శిక్షా ఉద్యోగుల వినూత్న నిరసన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కర్నూలు ధర్నా చౌక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నంద్యాలలో ఆవుకు వినతి పత్రం అందచేశారు. అర్ధనగ్న ప్రదర్శనతో కేక్ కోసి నిరసన తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు సమ్మె కొనసాగించారు. అనకాపల్లిలో సీఎం జగన్‌కు ఉత్తరాలు రాసి పంపి నిరసన తెలిపారు. పార్వతీపురంలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించి నిరసనలు చేశారు. విజయనగరంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి సీఎం జగన్‌కు ఉత్తరాలు పంపారు.