ఇది రోడ్డా! ప్రయాణించడం కంటే, నడుచుకుంటూ వెళ్తే సుఖంగా ఉంటుంది! - రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 7:47 PM IST
|Updated : Dec 9, 2023, 9:13 PM IST
Rudrampeta Road Highly Damaged: అనంతపురం జిల్లా రుద్రంపేట రహదారి ఇంతక ముందే గుంతల మయంగా మారింది. శనివారం ఉదయం కురిసిన వర్షానికి ఆ గుంతల దారి మరింత ఆధ్వానంగా తయారైంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఇరుక్కుని ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. నిత్యం ప్రమాదాలు జరగుతున్న ఈ రోడ్డు కనీసం మరమ్మతులు కూడా నోచుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. జిల్లా కేంద్రం నుంచి రుద్రంపేట, అలమూరు, దోపుదుర్తి, తగరకుంటకు వెళ్లే రహదారిలో గజానికో గుంత ఏర్పడింది. ఏళ్ల తరబడి రోడ్ల అభివృద్ధి, నిర్వహణకు పాలకులు పట్టించుకోకపోవడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం మీదుగానే నిత్యం వందలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ గుంతల రోడ్డుపై ప్రయాణంతో నరకం చూస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి నిత్యం ఈ రోడ్డుపైనే వెళ్లి వస్తుంటారు. కానీ కనీసం మరమ్మతులు కూడా చేయలేదని వాహనదారులు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రయాణమంటే సాహసంగా మారిందని అంటున్నారు.