బస్సు మరమ్మతులకు డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు ఆపాలి - ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
RTC Employees are Protest in Ongole : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీపీటీడీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రకాశం జిల్లా ఒంగోలు డిపోలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అప్పీళ్లపై సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని డిపోల్లో క్యూల్ కిట్లను వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. గ్యారేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేధింపు చర్యలను ఆపాలని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
RTC Employees are Protest in Markapuram : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఆర్టీసి డిపో ఎదుట జిల్లా ప్రజారవాణా అధికారి వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా నిబంధనల పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారని యూనియన్ సభ్యులు మండిపడ్డారు. బస్సు మరమ్మతులకు కూడా డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు.