Electric Bus: కడప-తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు.. ప్రారంభించిన ఆర్టీసీ ఛైర్మన్ - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 1, 2023, 6:08 PM IST

Electric bus services started in Kadapa: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ బస్సు సర్వీసులను ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి కడప జిల్లాలో ప్రారంభించారు. కడప-తిరుపతి మధ్య 12 విద్యుత్‌ ఏసీ బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఆరు బస్సులు కడప నుంచి తిరుపతికి.. మిగిలిన ఆరు బస్సులు తిరుపతి నుంచి కడపకు నడుస్తుంటాయని చెప్పారు. ఉదయం 4:30 గంటలకు బస్సులు ప్రారంభమవుతాయని.. రాత్రి 7:30 గంటలకు చివరి బస్సు వెళ్తుందని పేర్కొన్నారు. అత్యధికమైన సౌకర్యాలతో బస్సులను ప్రారంభించామని పూర్తి శీతల బస్సు అని పేర్కొన్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతికి 50 బస్సులు, తిరుమల-రేణిగుంట విమానాశ్రయానికి 14 , తిరుపతి- మదనపల్లికి 12, తిరుపతి-నెల్లూరుకు 12 చొప్పున బస్సులను మొదట విడతగా కేటాయించినట్లు వివరించారు. 

రాబోయే రోజుల్లో మరిన్ని నూతన బస్సులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో.. ఈ అత్యాధునిక విద్యుత్‌ ఏసీ బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల బస్సు సర్వీసులు అందుబాటులో ఉండగా.. మరికొన్ని బస్సులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కాలుష్యాన్ని నివారించే కార్యక్రమంలో భాగంగానే ఈ విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.