RTC bus Overturned In Prakasam District : ప్రకాశం జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా.. 9మందికి గాయాలు - bus accident in andhra pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 3:21 PM IST
RTC bus Overturned In Prakasam District : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం డిపోకు చెందిన ఇంద్ర బస్సు హైదరాబాద్ నుంచి మార్కాపురం బయల్దేరింది. ఈ క్రమంలో బోయలపల్లి వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు నుజ్జు నుజ్జు కాగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను.. 108 వాహనంలో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగిలిన ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసి అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల వివరాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.