RTC Bus Hits Lorry: ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు - RTC bus driver died in accident
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-07-2023/640-480-18952649-69-18952649-1688884329501.jpg)
RTC Bus Hits Lorry: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. అతని ప్రాణాలు తీసింది. దీంతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కూడా గాయాలపాలు చేసింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని.. ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ భైరవ మూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో సుగుణమ్మ, కృష్ణవంశీ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉన్నారు.