Road Accident in Nandyala : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం.. ఇద్దరికి గాయాలు - గిద్దలూరు రహదారి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-09-2023/640-480-19481743-thumbnail-16x9-road-accident-in-nandyala.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2023, 10:54 AM IST
Road Accident in Nandyala Dist : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రహదారిలో బోయలకుంట్ల మెట్ట వద్ద బొలెరో వాహనం ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మి, సుబ్బమ్మ అనే ఇద్దరు మహిళలు, బంగారు రాజు అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు నంద్యాల మండలం మిట్నాల గ్రామం కాగా, మరొకరిది యల్లురు గ్రామం.
ఈ ముగ్గురితో పాటు తిమ్మరాజు, మార్తమ్మ కలిసి బిల్లలాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి కుటుంబ పంచాయతీ కోసం మహానంది ఫారంలోని బంధువు మనోహర్ ఇంటికి వెళ్లి.. రాత్రి 9:30గంటలకు ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. బయిలకుంట్ల మెట్ట వద్ద నంద్యాల నుంచి చేపల లోడుతో ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బొలెరో వాహనం వీరి ఆటో ఢీకొన్నాయి. ముగ్గురు మృతి చెందగా.. గాయపడిన మార్తమ్మ, తిమ్మరాజును నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ జి. నాగేంద్రప్రసాద్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.