విశాఖలో వంద ఎకరాలు కేటాయించండి : సీఎం జగన్కు ధర్మాన లేఖ
🎬 Watch Now: Feature Video
Revenue Minister Dharmana Prasad Rao Letter to CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్థిని కోరుతూ ఈరోజు(గురువారం) రెవెన్యూ శాఖా మంత్రి (Revenue, Registration Minister) ధర్మాన ప్రసాదరావు... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రిజర్వు బ్యాంకు(Reserve Bank), ఇతర జాతీయ బ్యాంకుల జోనల్ కార్యాలయాలు, కెపీఎంజి(KPMG) లాంటి సంస్థలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రసాదరావు సీఎం జగన్కు లేఖలో విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్కు విన్నపం చేశారు.
Hundred Acres Allocate For Financial Hub: ఫైనాన్షియల్ హబ్ (financial Hub) ఏర్పాటుకు సంబంధించి విశాఖలో వంద ఎకరాల భూమిని కేటాయించాలని లేఖ ద్వారా మంత్రి కోరారు. రిజర్వ్ బ్యాంకు సహా ఆర్థిక సంస్థలు.. ఈ ఫైనాన్షియల్ హబ్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులకు సూచనలు చేయాలని సీఎంకు రాసిన లేఖలో మంత్రి ధర్మాన పేర్కొన్నారు.