చక్రాలలో పొగలు.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం - కావలిరైల్వే స్టేషన్లోఆగిన రాజధాని ఎక్స్‌ప్రెస్
🎬 Watch Now: Feature Video
Rajdhani Express stop Due To Smoke In Kavali Railway Station : నిజాముద్దీన్ నుంచి చెన్నైకు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో హుటాహుటిన రైలును నిలిపివేశారు. రాజధాని ఎక్స్ప్రెస్ బి-5 బోగి వద్ద పొగలు రావడంతో రైల్వే అధికారులు గమనించారు. కావలి రైల్వేస్టేషన్‌లో రైలును ఆపిన లోకో పైలట్.. చక్రాల రాపిడి వల్ల పొగలు వస్తున్నట్లు గుర్తించారు. పొగలు వచ్చిన విషయం తెలిసి ప్రయాణికులు భయపడి పోయారు. అందరూ కిందకి దిగి పరుగులు తీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ముప్పై నిమిషాల తరువాత స్వల్ప మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్ ముందుకు కదిలింది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. దీంతో రైలులో ప్రయాణిస్తున్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు.