మాండౌస్ తుపాను ప్రభావం.. పలు ప్రాంతాల్లో వర్షాలు - నెల్లూరు జిల్లాలో తుఫాను
🎬 Watch Now: Feature Video
తీవ్ర తుపాన్‌గా మారిన మాండౌస్.. దక్షిణకోస్తా, రాయలసీమలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు.. పలు ప్రాంతంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు తుపాన్ తీవ్రతను అంచనా వేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగానే అన్నిరకాల చర్యలు చేపట్టామని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో సముద్రం ముందుకొచ్చింది. అనకాపల్లి జిల్లాలో రైతులు తుపాను కారణంగా అప్రమత్తమయ్యారు. అప్పటికే కోసిన వరి పంటలు తడిసిపోయాయని ఆందోళన చెందుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST