వంటింట్లో 12 అడుగుల కొండచిలువ - భయంతో పరుగులు - python in manikeswaram village

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 3:51 PM IST

Python Creat Panic Situations In Bapatla District : బాపట్ల జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో పెద్ద పాము (అజగరము) కలకలం రేపింది. గ్రామానికి చెందిన సిద్ధయ్య ఇంట్లోకి చేరి ఓ మూలన ఉంది. 12 అడుగుల కొండచిలువను చూసిన కుటుంబ ఇంట్లోవారు భయంతో బయటకు పరుగులు తీశారు. దాన్ని చూసిన గ్రామస్తులంతా భయ భ్రాంతులకు గురయ్యారు. కొండ చిలువలు తరచూ ఇళ్ళలోకి వస్తున్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 

12 Feet Python Caught In  Bapatla Andra Pradesh : గ్రామస్థులంతా కలిసి కొండచిలువను పట్టుకుని దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. తరుచూ జరిగే ఇటువంటి ఘటనలతో తాము విసిగెత్తి పోయామని గ్రామస్తులు నిరాశ వ్యక్తం చేశారు. ఇళ్లలోకి విష జీవులు వచ్చి చేరడంతో తాము ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బతకాల్సొస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఇటువంటి ఘటనలను నియంత్రించడానికి త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.