Purandeswari Inspects Govt Liquor Shop: లక్ష రూపాయల మద్యం అమ్మితే.. 700 రూపాయల బిల్..!
🎬 Watch Now: Feature Video
Purandeswari Inspects Govt Liquor Shop: రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయాల ద్వారా ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతుందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని లిక్కర్ సీసాలతో నిరసన ప్రదర్శన చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె... బ్రాందీ షాపులోనికి వెళ్లి వివరాలు అడిగారు. ఈ రోజు ఇప్పటి వరకు రూ. లక్ష అమ్మకాలు చేసినట్లు సేల్స్ మెన్ తెలిపారు. ఇప్పటి వరకూ ఎన్ని బిల్లులు ఇచ్చారు అని అడగగా.. రూ.700కు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దశలు వారీగా అమలు చేస్తామని చెప్పిందని పేర్కొన్నారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. నాసిరకం మద్యం విక్రయాలు చేసి అనేక కుటుంబాలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచు కుంటున్నారు. మద్యం బాండ్లు తాకట్టు పెట్టి లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.