Protest for Infrastructure: మౌలిక వసతులు కల్పించండి.. జగనన్న కాలనీవాసుల ఆందోళన - jagananna colony layout
🎬 Watch Now: Feature Video
Protest to infrastructure in Jagananna Colony : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని జగనన్న కాలనీలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం ముందు మౌనంగా నిరసన చేపట్టారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జగనన్న కాలనీలో మౌలిక వసతులు కరవయ్యాయని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. అడవి జంతువులు కూడా యథేచ్ఛగా తిరుగుతుండడంతో.. ఇక్కడ నివసించాలంటే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిలబడి.. తమ డిమాండ్లు పరిష్కరించాలని మౌనంగా నిరసన వ్యక్తం చేశారు. పలు సమస్యలపై కాలనీవాసులు ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చారు. రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నామన్నారు. కలెక్టర్కు సమస్యలపై ఫిర్యాదు చేసినా కూడా.. ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు కనీస మౌలిక వసతులపై స్పందించలేదని విచారం వ్యక్తం చేస్తూన్నారు. వెంటనే తమకు వసతులు కల్పించాలని కాలనీవాసులు ఎమ్మార్వోను కోరారు.