ప్రొద్దుటూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు - news on ap elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 3:29 PM IST

Proddutur Election Returning Officer Rammohan Suspension: రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అక్రమ ఓట్ల నమోదు, తొలగింపు ప్రక్రియపై ప్రతిపక్షాలు గత కొంతకాలంగా ఆందోళనలు, ఫిర్యాదులు చేస్తున్నాయి. అయినప్పటికీ, అధికారులు స్పందించడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఓట్ల అక్రమమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటర్ల సవరణలో జరిగిన అవకతవలపై విచారణ చేపట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్​పై సస్పెన్షన్ వేటు వేశారు. 

రామ్మోహన్​ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల సవరణ జాబితాలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని రామ్మోహన్​పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  మృతుల ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించక పోవడంపై ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులు, విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.