Pratidhwani: గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామంటున్న సీఎం జగన్ మాటల్లో నిజమెంత..? - Pratidhwani news
🎬 Watch Now: Feature Video

Pratidhwani Debate on Sarpanchs Funds: తమ 50 నెలల పాలనలోనే రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం అన్న మాటకు అర్థం తెచ్చామంటూ.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్భాటంగా ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి జగనన్న రాజ్యం ఆ గ్రామ స్వరాజ్యం ఎలా ఉంది.. మా నిధులు, విధులు మహప్రభో అని రోడ్లపై భిక్షమెత్తుకుంటున్న సర్పంచుల ఆవేదన సాక్షిగా.. సీఎం జగన్ మాటల్లో నిజం ఎంత ఉంది.. స్వయంగా అధికార పార్టీ మద్దతుదారులైన సర్పంచులే ప్రభుత్వ తీరుపై విసిరి వేసారి చెప్పులతో చెంప లేసుకున్న ఉదంతాలు.. గ్రామపెద్దల అరగుండు నిరసనలు ఏ పల్లె వెలుగులకు తార్కాణాలు ? వైసీపీ అధికారంలోకి వచ్చాకా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకుని వచ్చారు అని అధికార పార్టీ చెబుతోంది. మీకు గ్రామ స్వరాజ్యం ఎక్కడైనా కనిపించిందా ? పంచాయతీరాజ్ వ్యవస్థపైనా ఎలాంటి అవగాహన లేని వాలంటీర్ల చేతుల్లో ఆ అధికారాలు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా ఎటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.