రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి మంత్రికి తెలుసా? - పోలవరం ప్రాజెక్టు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 9:28 PM IST

Pratidhwani Debate on Irrigation Sector: ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని అయోమయంలో పోలవరం, గేట్లు కొట్టుకుపోతున్న గుండ్లకమ్మ, నిత్యం చింతగానే మారిన పులిచింతల, నామరూపాల్లేకుండా పోయిన అన్నమయ్య డ్యామ్. రాష్ట్రంలో సాగునీటిరంగం గురించి ప్రస్తావనకు రాగానే కళ్ల ముందు మెదిలే దృశ్యాలు ఇవే. కొంతకాలంగా ప్రాజెక్టుల నిర్వహణే కాదు. కొత్తవాటి నిర్మాణంలోనూ అదే అలసత్వం. జగన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో కట్టినవి రెండే ప్రాజెక్టులు అంటున్న గణాంకాలు ప్రభుత్వ ప్రచారంలో డొల్లతనాన్నీ వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వానికి, ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ని మార్కులు వేయొచ్చు? సాగునీటి పారుదల రంగ నిపుణులు ఏమంటున్నారు? ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖల్లో ఇరిగేషన్‌ ప్రధానమైనది. ఈ శాఖను నిర్వహించే మంత్రికి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు, సాగునీరు, వరదనీటి నిర్వహణ ఇలా అనేక అంశాల్లో పరిజ్ఞానం ఉండాలి. బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే అన్నీ ఉండకపోవచ్చు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు పనితీరును మీరెలా విశ్లేషిస్తారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.