Prathidwani: జగన్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలేంటి? కట్టిన ఇళ్లు ఎన్ని? - టిడ్కో ఇళ్లు
🎬 Watch Now: Feature Video
Promises given in YCP Manifesto: రాష్ట్రంలోని పేదలు అందరికీ 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం చేపడామతామని వైసీపీ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అసలు ఈ నాలుగేళ్లుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చింది. ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన మిగిలిన హామీల సంగతి ఏమిటి? ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమై.. పంపిణీకి కూడా సిద్ధమైన టిడ్కో ఇళ్లను ఇవ్వకుండా రాజకీయ కక్షతో ఇవ్వకుండా ఆపేశారు. ఇప్పుడు రుణాలు కట్టమంటే.. లబ్దిదారుల పరిస్థితి ఏమిటి? రెండేళ్ల గడువుతో టిడ్కో తీసుకున్న రుణాలకు కాలపరిమితి దాటి పోవడంతో ఆ నిర్మాణాలు ఎన్పీఏ ముప్పులో పడిన పరిస్థితి కూడా చూశాం. ఇక.. ఇంటి స్థలం లేని పేదలకు భూమి కూడా తామే అందించి.. ఇళ్లు కట్టించి ఇస్తాము అన్న హామీ అమలు ఎలా ఉంది? ఈ విభాగంలో ఇప్పటికి ఎంతమందికి పూర్తిస్థాయి లబ్ది చేకూర్చారు? వాస్తవాలు ఇలా ఉంటే.. ఇప్పటికీ మేనిఫెస్టోలో 98.5శాతం అమలు చేశామని వైసీపీ ప్రభుత్వం ఎలా చెబుతోంది? ఈ విషయాలు ప్రజలకు తెలియవా? తెలుసుకోలేరనా? రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోందని.. తనను తానో పేదల ప్రతినిధిని అని ప్రకటించుకున్న సీఎం జగన్.. వాళ్లందరి బిడ్డగా వాళ్లకు చేసింది ఇదేనా? ఇప్పుడు ప్రజలముందున్న మార్గమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.