కోర్టు ఆదేశాలున్నా యథేచ్ఛగా ఉల్లంఘనలు.. రుషికొండ వద్ద పరిస్థితి ఏమిటి - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Prathidwani కొండల్ని పెంచలేం.. వాటిని కాపాడుకోవాలి. విశాఖనగరంలోని తీరాన్ని ఆనుకుని ఉన్న రుషికొండపై కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి. కానీ వాస్తవంలో జరుగుతోంది మాత్రం.. అందుకు విరుద్ధం. రుషికొండ పిండిగా మారుతూ దాని రూపం మాయం అవుతోంది. అనుమతుల ప్రకారమే రుషికొండ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం, పాలక పెద్దలు ఎంత సమర్థించుకుంటున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితులు వాస్తవమేంటో చెప్పకనే చెబుతున్నాయి. కోర్టు ఆదేశాలున్నా యథేచ్ఛగా ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని.. వద్దన్న చోటే పనులు వేగంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పుడు రుషికొండ వద్ద పరిస్థితి ఏమిటి? తీరప్రాంత నిబంధనల అమలులో ఏం జరుగుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST