Prathidwani: ప్రతిపక్ష పార్టీల పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎలా ఉంది? - today Prathidwani on ap police
🎬 Watch Now: Feature Video
Prathidwani: పోలీసు రాజ్యం.. వైఎస్సార్సీపీ రాజ్యాంగం.. రాష్ట్రంలో కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న ఆవేదన.. ఆక్రోశం.. ఇది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగేళ్లుగా అధికారమే అండగా అరాచకం రాజ్యమేలుతోందన్నది వారందరి ప్రధాన ఫిర్యాదు. ప్రస్తుతం అంగళ్లు ఘటన కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను అందుకు మరో ఉదాహరణగా చూపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. విపక్షనేత నారా చంద్రబాబు నాయుడుపై ఏకంగా హత్యాయత్నం కేసు కట్టిన అంగళ్లు ఘటనలో అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇతర పార్టీల కార్యక్రమాల దగ్గరకు వైసీపీ వారిని ఎందుకు పోలీసులు అనుమతిస్తున్నారు? పరస్పర ఘర్షణలు జరిగినప్పుడు వైసీపీ వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారా? ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం అనుమతి తీసుకుని ఒక ప్రాంతంలో పర్యటిస్తుంటే అడ్డుకుంటాం అని అధికార పార్టీ ప్రకటించటం సమంజసమేనా? ఇది పోలీసులకు తెలియదా? అలా మాట్లాడి రెచ్చగొట్టిన వారిపై కేసులు పెట్టలేదా? రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పట్ల, వారి కార్యక్రమాల పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎలా ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.