PRATHIDWANI అమరావతి రైతుల పాదయాత్రపై ఘర్షణ వాతావరణం ఎందుకు - Latest ap Prathidwan program details
🎬 Watch Now: Feature Video
అమరావతి రైతులు పాదయాత్ర విషయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతుల పాదయాత్ర నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది. అమరావతి రైతులు, ప్రభుత్వ, పోలీసులకు మధ్య ఎందుకు ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో.. అమరావతి నుంచి అరసవెల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రను ముందుకు తీసుకుని వెళ్లడానికి రాజధాని ప్రాంత రైతులు ఎలా సన్నద్ధం అవుతున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST