దళితులను తిట్టడం, కొట్టడం, గుండు గీయించడం, చంపి డోర్ డెలివరీ చేయడం!
🎬 Watch Now: Feature Video
Prathidhwani: ఇంతకంటే దారుణం ఉండదు అనుకున్న ప్రతిసారి.. అంతకన్నా హేయంగా, దారుణంగా కొనసాగుతునే ఉన్నాయి రాష్ట్రంలో దళితులపై దాడులు. తిట్టడం, కొట్టడం, గుండు గీయించడం, కస్టడీలో మరణాలు, చిన్నచిన్న కారణాలకే చావబాదడం, చంపి డోర్ డెలివరీ చేయడం.. వెంటాడి వేధింపు ప్రాణాల తీయడం ఇలా ఎన్నెన్నో దాష్టీకాలు ఈ దమనకాండలో. నాలుగున్నరేళ్ల జగనన్న ఏలుబడిలో రక్షణలేకుండా పోతున్న బడుగుల జీవితాలకు సంబంధించి ఇప్పుడు మరో నిర్ఘాంతపోయే ఘటన వెలుగుచూసింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఒక దళితయువకుడికి చిత్రహింసలు పెట్టడమే కాదు, మంచినీళ్లు అడిగితే నోట్లో మూత్రం పోశారు దుండగులు. అసలు బడుగు బలహీనవర్గాలకు ఈ రాష్ట్రంలో భద్రంగా బతికే హక్కు, జీవించే భరోసాను ఈ ప్రభుత్వం ఇస్తోందా? అట్రాసిటీల్లోనూ రోజురోజుకీ ఘటనల్లో తీవ్రత పెరుగుతోంది. గుండు గీయించడం, కస్టడీలో మరణాలు, చిన్నచిన్న కారణాలకే చావబాదడం వంటి ఘటనలు జరుగుతుంటే ఆ జిల్లా మంత్రులు కానీ, అధికారపార్టీ పెద్దలు కానీ ఎందుకు రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవట్లేదు? పౌరులు అందరు సమానం. పౌరుల వ్యక్తి గౌరవం అత్యున్నతం అని రాజ్యాంగం చెబుతోంది. రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇవ్వగలదా? ఇదీ నేటి ప్రతిధ్వని.