Prathidhwani: పేద, బడుగు బలహీనవర్గాలు విద్యకు దూరమయ్యే ముప్పుందా..?
🎬 Watch Now: Feature Video
Prathidhwani: బడిగంటకు వేళయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా... పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులంతా తిరిగి బడిబాట పట్టారు. ఈ సందర్భంగానే రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చామని అంటున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులు రూపు మార్చి.. విద్యార్థులకు సకల సౌకర్యాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రకటిస్తున్నారు. మరి.. ఆ మాటల్లో నిజం ఎంత? రాష్ట్రంలో పాఠశాల విద్య ముందున్న సమస్యలు, సవాళ్లపై విద్యార్థి సంఘాలు.., ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఏం అంటున్నారు?
కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగానే పాఠశాలల హేతుబద్దీకరణ అంటున్న రాష్ట్ర ప్రభుత్వ వాదన నిజమేనా? అదే నిజమైతే జగన్ ప్రభుత్వం తీరుతో పేద, బడుగు, బలహీన వర్గాలు విద్యకు దూరమయ్యే ముప్పు అని ఆందోళనలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి? ప్రభుత్వం చెబుతున్న స్థాయిలో రాష్ట్ర విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి నిజంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారా? సౌకర్యాల కల్పనతో పాటు బోధనకు అత్యంత కీలక మైన ఉపాధ్యాయుల కొరతను అధిగమించారా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.