Prathidhwani హక్కులు లాక్కోడం ఇంత సులవా..? ఇది న్యాయానికి సంకెళ్లు వేయడం కాదా? - political Actions On Chandrababu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-10-2023/640-480-19783943-thumbnail-16x9-prathidhwani.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 11:13 PM IST
Prathidhwani: నెలరోజులకు పైగా జరుగుతున్న రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల్లో మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు, జైలులో ఉంచిన తీరు, అక్కడ ఆయన పట్ల వ్యవహరిస్తున్న విధానంపై ఎన్నో ప్రశ్నలు. ప్రధానంగా ఎవరినైనా అరెస్టు చేయడం, వారి హక్కులు లాక్కోడం ఇంత ఈజీనా అని.. అనిపించేలా జరగుతున్న పరిణామలు చెబుతున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసి 38 రోజులు అవుతోంది. కానీ చిత్రం ఏమిటంటే ఆ దర్యాప్తు సంస్థ గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ నేటికీ సరైన ఆధారాలు చూపలేని స్థితిలోనే కనిపిస్తున్నాయి. కోర్టుల్లోనూ కావాలని జాప్యం చేయటం కోసం ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది న్యాయానికి సంకెళ్లు వేయడం కాదా? చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని, రాజకీయ ప్రేరేపితం అని ఇండియా లీగల్ వంటి జర్నల్స్ జాతీయస్థాయిలో కోడై కూస్తున్నాయి. మరోవైపు చంద్రబాబునాయుడుకి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కక్షసాధింపుతో కనీస ఆధారాలు లేకుండా జైలుకు పంపితే భవిష్యత్తు పర్యవసానాలు ఎలా ఉంటాయి? న్యాయవాద వర్గాల్లో, జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణాలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.