Pothina Mahesh on Vellampalli Birthday బర్త్ డేను ఇలా ఎప్పుడు కావాలంటే, అప్పడు జరుపుకుంటారా! వెల్లంపల్లిని ప్రశ్నించిన పోతిన.. - AP Latest News
🎬 Watch Now: Feature Video
Pothina Mahesh comments on Vellampalli Srinivasa Rao: విజయవాడ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు ఆగస్టు 9 అయితే ఆగస్టు 15న పుట్టని రోజను పుట్టిన రోజుగా జరుపుకుంటున్న వెల్లంపల్లి వ్యవహారం చూస్తుంటే పెళ్లి చేసుకుందాం సినిమాలో బ్రహ్మానందం సీను గుర్తొస్తుందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు. వెల్లంపల్లి ఎమ్మెల్యే అవ్వక ముందు వరకు ఆగష్టు 9న పుట్టిన రోజు జరుపుకున్నారు.. కాని ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ హైస్కూల్లో వెలంపల్లి చదివిన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్‌ను బయటపెట్టి తన నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెలంపల్లి శ్రీనివాసరావు 2014- 2019 ఎన్నికల అఫిడవిట్లో టెన్త్ క్లాస్ అని డిక్లరేషన్ ఇచ్చారు. ఆ ఆధారంతోనే ఆయనను ప్రశ్నిస్తున్నానని అన్నారు. భారత దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ఘోరంగా అవమానిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావును పశ్చిమ ప్రజలు క్షమించవద్దని అన్నారు.