Pothina Mahesh on Kanakadurga Goddess Decoration దసరా ఉత్సవాలలో అమ్మవారి అలంకారం ఆచారాన్ని ఎందుకు మార్చారు: పోతిన మహేష్​ - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 7:52 PM IST

Pothina Mahesh Comments on Kanakadurga Goddess Change of Decoration: దసరా ఉత్సవాలలో అమ్మవారి అలంకారం మార్పు ఆచారమా? అపచారమా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. స్వర్ణ కవచ అలంకారం తీసేసి మహా చండి అలంకారాన్ని ఏ ఆచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే అది రాష్ట్రంలో అతి పెద్ద పండగ.. కాని ఈ ఏడాది ఆలయ అధికారులు ఏ సాంప్రదాయాన్ని అనుసరించి అవతారాన్ని తీసి మరొక అవతారం ఏర్పాటు చేయడానికి గల కారణాలు తెలపాలని ప్రశ్నించారు. మీరు భక్తులకు కచ్చింతంగా సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని మార్పు ఎందుకు.. ఎవరి కోసం చేశారని నిలదీశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఆలయ ఈవో , ఎండోమెంట్ అధికారులు, పాలకమండలి చైర్మన్ భక్తులకు సమాధానం చెప్పాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.