'హైదరాబాద్ టు బెంగళూర్' ఏకంగా కంటెయినర్లోనే - భారీగా గంజాయి తరలిస్తుండగా పట్టివేత - police seized cannabis in chilamatooru
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 5:08 PM IST
Police Seized Ganga in Satyasai District: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి రవాణా ఆగడం లేదు. ఏదో మార్గంలో అక్రమంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తరలిస్తున్నారు. ఎన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చివరకు ఎక్కడో ఒక చోట పట్టుబడుతున్నారు. తాజాగా గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయి ఈరోజు పోలీసులకు చిక్కింది.
300 kg of Ganja Transported in Container: శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద గంజాయి తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు కంటైనర్‌లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి 300 కిలోలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కంటైనర్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.