Police Restrictions During Minister Birthday Celebrations: మంత్రి జన్మదిన వేడుకలు.. పోలీసుల ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు - Police anarchists in Hindupur
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 7:03 PM IST
Police Restrictions During Minister Birthday Celebrations: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు ఆంక్షలు విధించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కూడలి వద్ద సభా ప్రాంగణం ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లోకి వాహనాలు పోకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో జిల్లా ప్రభుత్వాసుపత్రి, అదనపు జిల్లా కోర్టు, తహసీల్దార్ కార్యాలయం, వ్యాపార వాణిజ్య ప్రధాన సముదాయం కావడంతో మార్కెట్‌ను నిర్బంధించడం వల్ల హిందూపురం పట్టణ వాసులతోపాటు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రెండు రోజుల క్రితం చంద్రబాబు కోసం కురుబ సంఘం వారు ఏర్పాటు చేసిన ర్యాలీని 30 యాక్టు పేరిట అడ్డుకొని అరెస్టు చేసి పోలీసులు హంగామా సృష్టించారు.. 30 యాక్ట్ అమలు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే వర్తిస్తుందా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో వ్యాపార సదుపాయాలు, ప్రభుత్వాస్పత్రి ఉందని వివరించారు. పోలీసులు పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.