TIRUNALLU: నూతనపాడులో కన్నుల పండువగా పోలేరమ్మ తిరునాళ్లు..
🎬 Watch Now: Feature Video
POLERAMMA TIRUNALLU AT NUTHANAPADU: బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతనపాడు గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్లు కన్నుల పండువగా జరిగింది. ఈ తిరునాళ్లకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావటంతో ఆ ప్రాంతమంతా జన సందోహంగా మారింది. తిరునాళ్లలో పాల్గొన్న భక్తులు, రైతులు.. అమ్మవారికి పొంగళ్లు పొంగించి.. మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి విశేష పూజల అనంతరం సిరిమాను ఉత్సవం నిర్వహించారు. వేడుకలో పాల్గొన్న భక్తులు.. సిరిమాను బండి లాగుతూ గ్రామోత్సవం చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా సిరిమానుకు ఉంచిన ఊచల బోనులో మేకపోతును ఉంచారు. ఆ మేకపోతు పైకి భక్తులు జీడికాయలు విసిరి తమ కోర్కెలు చెప్పుకున్నారు. ఈ తిరునాళ్లు మహోత్సవంలో కొంతమంది దాతలు.. భక్తులకు మజ్జిగ, తాగునీటి వసతులు కల్పించారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.