Polavaram destruction in Jagan's rule: జగన్ గొడ్డలి వేటు.. పోలవరం, ప్రజల జీవితాలు నవ్వుల పాలు: చంద్రబాబు - tdp released video on polavaram
🎬 Watch Now: Feature Video
Polavaram destruction in Jagan's rule: ఆంధ్రప్రదేశ్‌కు తలమాణికమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వదిలేసిన జగన్.. రాష్ట్రాన్ని, ప్రజల జీవితాల్ని నవ్వులపాలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసే విషయమై అధికార పార్టీ నేతలు పలు సందర్భాల్లో చేసిన ప్రకటనలు గుర్తుచేస్తూ.. చంద్రబాబు విడుదల చేసిన ఓ వీడియో ఆసక్తి రేపుతోంది. 2021జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాటి నుంచి వివిధ సందర్భాల్లో చేసిన ప్రకటనలతో పాటు.. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు అనిల్ కుమార్, అంబటి రాంబాబు మాట మార్చిన తీరును వివరిస్తూ రూపొందించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 'పోలవరానికి గొడ్డలి వేటు' పేరిట రూపొందించిన ఈ వీడియోలను ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ప్రజలు అర్థం చేసుకోనంత వరకే వీరి ఆటలు సాగుతాయని వివరించారు. ప్రాజెక్టుల క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా ఆగస్టు 1వ తేదీన తన పర్యటనల్ని రాయలసీమ నుంచి చేపట్టేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.